కే ట్యాక్స్ బాధితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోడెల కుటుంబ సభ్యులపై 19 కేసులు పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్లేనని... కేసులన్నింటికీ ఆధారాలున్నాయని తెలిపారు. మాజీ సభాపతి ఇంటి ముందు ధర్నా చేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, తమ పార్టీకి సంబంధం లేదని గోపిరెడ్డి తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమపై, విజయసాయిరెడ్డి పై, పార్టీపై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయన్నారు. కోడెల స్టేడియంలో గత ప్రభుత్వ హయాంలో అన్నీ అవకతవకలే జరిగాయని గోపిరెడ్డి అన్నారు. అప్పటి నిర్వాహకులు లెక్కలు తేలకుండా రికార్డులు మాయం చేశారన్నారు. ఇక బడ్జెట్ విషయానికొస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైకాపా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేర్చిందని గోపిరెడ్డి తెలిపారు. నవరత్నాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కే ట్యాక్స్ బాధితులతో మాకు సంబంధం లేదు: వైకాపా - We have nothing to do with Kay tax victim : mla gopireddy
కోడెల కుటుంబ సభ్యులపై 19 కేసులు పెట్టింది తెదేపా వాళ్లేనని...పెట్టిన కేసులన్నింటికీ ఆధారాలున్నాయని నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
నరసాపురం వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
TAGGED:
నరసాపురం