డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కొందరు ప్రముఖులు, జిల్లా ఎస్పీలు, విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డ్రగ్ మాఫియా ఏరివేతకు కఠిన చర్యలు: డీజీపీ - ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వార్తలు
మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వాడొద్దంటూ సినీ, క్రీడా ప్రముఖులు పిలుపునిచ్చారు.
ap police
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పిస్తూ వీడియోనుడీజీపీ విడుదల చేశారు. యువకులు మత్తుకు బానిసలుగా మారి విలువైన భవిష్యత్తును కోల్పోవద్దనిప్రముఖులు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువతపై తల్లిదండ్రుల నిఘా అవసరమని సవాంగ్ అభిప్రాయపడ్డారు.