శాసనమండలి రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని... పదవులు ముఖ్యం కాదన్నారు. తెదేపా నేతలు రాజకీయంగా దిగజారి వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే 3 రాజధానుల ఏర్పాటు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లులకు సభా పరంగా అన్ని అనుమతులు ఉన్నా... మండలి ఛైర్మన్, తెదేపా సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలు ప్రక్కన పెట్టి స్వార్థ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు.
'మండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం' - మంత్రి మోపిదేవి తాజా వార్తలు
శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపితే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే 3 రాజధానుల ఏర్పాటు తప్పనిసరి అని మోపిదేవి అభిప్రాయపడ్డారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ