ఇది తెనాలి చార్మినార్...! గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ రహదారిలో.. షేక్ మీరా సాహెబ్ అనే వ్యక్తి ఇంటిపై భాగ్యనగర బుల్లి చార్మినార్ దర్శనమిస్తుంది. ఆ దారిలో వెళ్లే పాదచారులను ఆకర్షిస్తూ.. దర్జాగా ఇంటిపై నిలుచుంది. 25 ఏళ్ల నుంచి తెనాలిలో నివాసం ఉంటోన్న షేక్ మేరా సాహెబ్... నాలుగేళ్ల క్రితం ఓ భవంతిని నిర్మించుకున్నారు. భవనంపై నీటి ట్యాంకును ప్రత్యేకంగా కట్టుకోవాలని ఆలోచించి, చార్మినార్ ఆకారంలో కట్టామని అంటున్నారు. తమ తాతగారి సలహా మేరకు చార్మినార్ ఆకారంలో ట్యాంకును కట్టించామని కుటుంబీకులు తెలిపారు.
ఇదీ చదవండి: