పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ తో రూ.58కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఇదే ఒరవడితో ప్రాజెక్టులన్నింటిలోనూ పారదర్శక విధానం తీసుకొస్తామని తెలిపారు.రివర్స్ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్లను పాల్గొనవద్దని,తామెక్కడా చెప్పలేదని వెల్లడించారు.తెదేపా నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.తెదేపా హయాంలో ఎక్కువకు కోట్ చేసిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఇప్పుడు తక్కువకు కోట్ చేయడమే దీనికి నిదర్శనమని వెల్లడించారు.నవయుగ సంస్థను కూడా టెండర్లలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.గత ప్రభుత్వం టెండర్లలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని విమర్శించారు.ఇకనైనా తెదేపా నేతలు అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
'పోలవరం రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్లు ఆదా' - polavaram reverse tendering minister comments
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్లు ఆదాయ అయిందని, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ లో పాత కాంట్రాక్టర్లను పాల్గొనవద్దని,తామెక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు.
!['పోలవరం రివర్స్ టెండరింగ్ తో రూ.58 కోట్లు ఆదా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4507246-thumbnail-3x2-anilgupta.jpg)
మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
'పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.58 కోట్లు ఆదా'
ఇదీ చూడండి : కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతల్లో సీఎం పర్యటన