తాగు, సాగు నీటి అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ప్రాజెక్టు సీఈ జలంధర్, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీటి విడుదల ప్రారంభించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తున్నందున.. తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అన్నారు. జలాశయాల గేట్లు ఎత్తినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముంపు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటి విడుదల - nagarjunaproject news updates
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటి విడుదల