ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... గొంతులో గరళం - లేమల్లెపాడు

తాగునీటితోనే అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా సందర్భాల్లో నగదు వెచ్చించి కొనుక్కుంటాం. ప్రభుత్వాలు కూడా స్వచ్ఛమైన నీటినే సరఫరా చేస్తాయి. అటువంటిది స్వయంగా అధికారులే కలుషితమైన నీటిని ప్రజలకు సరఫరా చేస్తే... అలాంటి ఘటనే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడులో జరుగుతోంది. ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ఓ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం... గొంతులో గరళం

By

Published : Jul 9, 2019, 7:03 AM IST

అధికారుల నిర్లక్ష్యం... గొంతులో గరళం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామంలో దేవాదాయశాఖకు చెందిన తాగునీటి చెరువులు ఉన్నాయి. అందులో ఒకటి గేదెల చెరువు. మరొకటి తాగునీటి చెరువు. తాగునీటి చెరువులో నీరు అడుగంటి దుర్వాసన వస్తోంది. ఫలితంగా నీటి ఇబ్బంది ఏర్పడింది. అయితే... గేదెల కోసం ఉపయోగించే చెరువులో ఉన్న నీటిని తాగునీటి చెరువులోకి మళ్లించడానికి దేవాదాయశాఖ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని గ్రామస్థులు అడ్డగించడంతో.. ఆ అధికారి దాడికి ప్రయత్నించాడని గ్రామస్థులు వాపోయారు.

గ్రామ సమీపంలోని గేదెల చెరువులో కొన్నాళ్లక్రితం ఓ వ్యక్తి పడి చనిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో... 3రోజులు ఆ చెరువులోనే మృతదేహం ఉంది. చెరువులో శవాన్ని చూసిన గ్రామస్తులు.. ఆ నీటిని ఎలా తాగుతారని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చే మురుగు నీటిని గతంలో ఈ చెరువులో నింపారని... శుద్ధి చేసినా దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరుతాగితే పిల్లలకు రోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

అయితే ప్రశ్నించిన వారిపై ఓ అధికారి దాడి చేసేందుకు ప్రయత్నించాడని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామీణ నీటి సరఫరాపై అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండీ...

''పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తుంది''

ABOUT THE AUTHOR

...view details