Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయికి నీటిమట్టం - ఏపీ తాజా వార్తలు
పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయికి నీటిమట్టం
19:46 July 17
43.74 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ
పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలోకి నీరు వచ్చి చేరటంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77టీఎంసీలుగా కాగా.. ప్రస్తుత నీటినిల్వ 43.74 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి.. 30వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Last Updated : Jul 17, 2021, 8:33 PM IST