ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాగర్ జలాశయంలో నీటికుక్కలు సందడి..

By

Published : Jul 22, 2021, 3:48 PM IST

కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. వరద నీరు కారణంగా జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో నీటికుక్కలు జలాశయం నుంచి నుంచి బయటకు వచ్చి గట్లపై తిరుగుతున్నాయి.

Nagarjuna Sagar Reservoir
నాగార్జున సాగర్ జలాశయం

నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కలు

గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. వర్షాల కారణంగా వరదనీరు వచ్చి సాగర్​లో చేరుతోంది. ఈ క్రమంలో నీటికుక్కలు బయటకు వచ్చి గట్లపై తిరగాడుతున్నాయి. ఇవి జనసంచారం కనిపిస్తే నీటిలోకి వెళ్లిపోతాయి. అందుకే సందర్శకుల తాకిడి లేని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అట్టర్స్​గా పిలుచుకునే ఈ నీటి కుక్కలు అరుదైన జాతికి చెందిన జీవులు. ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details