గుంటూరు బ్రాడిపేటలో శ్రీ షిరిడీ సాయి సేవా ట్రస్ట్ ఛారిటీ వాల్ పేరిట చిన్నపాటి షోరూం ఏర్పాటు చేశారు. దుస్తులు, పుస్తకాలు, ఇతర సామాన్లు అక్కడ ఉంచుతారు. ఇవన్నీ ఎవరో ఒకరు కొంతకాలం ఉపయోగించి పక్కన పెట్టినవే. అలాంటి వాటిని ఛారిటీ వాల్ నిర్వహకులు సేకరించి... అవసరం ఉన్నవారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఎవరైనా సరే తమకు పనికిరాని వస్తువులు ఇక్కడ అందజేయవచ్చు.
ఎలా ఏర్పడిందంటే..
కొంతమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కలిసి షిర్డీసాయి సేవా ట్రస్టు ఏర్పాటు చేశారు. మొదటగా ఈ ట్రస్టు తరపున వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం ఈ ఛారిటీ వాల్ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ షాపు తెరిచి ఉంటుంది. టోకెన్ల ద్వారా వస్తువులు అందజేస్తారు. రెండేళ్లుగా ఛారిటి వాల్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.