ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viral Video: ప్రభుత్వం కొత్త రూల్​ పెట్టిందట.. ముందుగా సొమ్ము చెల్లిస్తేనే పథకాలకు అర్హులంట..!' - వార్డు వాలంటీర్ న్యూస్

చేయూత పథకానికి రూ. 2 వేలు, పింఛనుకు రూ. 3 వేలు, ఇంటి స్థలానికి రూ. 5 వేలు. ఏంటీ ఈ లెక్క అనుకుంటున్నారా..? ఇది ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న మెుత్తం అనుకుంటే మీరు పొరబడినట్లే ! ఆ పథకాలు మీకు అందాలంటే ముట్టజెప్పాల్సిన ముడుపుల లెక్క. అవునండీ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ 27వ వార్డు వాలంటీర్..ఏ పథకానికి ఎంత సమర్పించుకోవాలో తన పరిధిలో అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ వివరిస్తుంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Viral Video
'ప్రభుత్వం కొత్త రూల్..ముందుగా సొమ్ము చెల్లిస్తేనే ప్రభుత్వ పథకానికి అర్హులు'

By

Published : Jun 10, 2021, 6:57 PM IST

'ప్రభుత్వం కొత్త రూల్..ముందుగా సొమ్ము చెల్లిస్తేనే ప్రభుత్వ పథకానికి అర్హులు'

గుంటూరు జిల్లా చిలకలూరిపేట 27వ వార్డు వాలంటీర్ సోనీ.. ప్రభుత్వ పథకాలు కావాలంటే ఏ పథకానికి ఎంత సమర్పించుకోవాలో తన పరిధిలోని ఒక ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు చెబుతున్న వీడియో వైరల్​గా మారింది. ఎలాంటి భయం లేకుండా బరితెగింపుగా ప్రభుత్వ పథకాలు రావాలంటే ఎంత ముడుపులు ముట్టజెప్పాలో నిస్సిగ్గుగా వివరించింది. కొత్త పింఛన్ కావాలంటే రూ.3 వేలు, ఇళ్ల స్థలానికి రూ. 5 వేలు, చేయాతకు రూ. 2 వేలు అంటూ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ధర చెబుతూ లంచం డిమాండ్ చేసింది. ముడుపులు ముందుగా చెల్లిస్తేనే..లబ్ధిదారుల దరఖాస్తును ఆన్​లైన్ చేస్తామని వివరించింది.

ప్రభుత్వం ఇసారి కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని.., ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని లబ్ధిదారులకు వివరించింది. ఈ మొత్తం తమ పైఅధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని నిర్భయంగా వెల్లడించింది. ప్రభుత్వం పథకాలు కావాలంటే తనకు ఫోన్ చేసి సంప్రదించాలని ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తే.. పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తామని తెలిపింది. ఎట్టకేలకు వైరల్ వీడియో అధికారుల దృష్టికి చేరటంతో కమిషనర్ సదరు వాలంటీర్ సోనీని విధుల నుంచి తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details