గుంటూరు నగరపాలక సంస్థ పరిధి శాంతినగర్‌లోని 85వ వార్డు సచివాలయంలో అవినీతికి పాల్పడుతున్న కేవీ రూప అనే వార్డు వాలంటీర్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. నగర పాలక కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు వాలంటీర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ధర నిర్ణయించి దరఖాస్తుదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేయించగా..ఆరోపణలు నిర్ధరణ కావటంతో ఆమెను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ వివరించారు.
అవినీతికి పాల్పడుతున్న వార్డు వాలంటీర్‌ను తొలగించిన కమిషనర్ - Ward volunteer dismissal for corruption in guntur updates
వార్డు సచివాలయంలో అవినీతికి పాల్పడుతున్న వార్డు వాలంటీర్‌ను విధుల నుంచి అధికారులు తొలగించారు. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ధర నిర్ణయించి దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని.. అందుకే విధుల నుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
![అవినీతికి పాల్పడుతున్న వార్డు వాలంటీర్‌ను తొలగించిన కమిషనర్ Ward volunteer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8774971-558-8774971-1599905519907.jpg)
Ward volunteer
TAGGED:
గుంటూరు జిల్లా వార్తలు