ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ పంచాయతీ ఎన్నికలు.. ఎక్కడ? ఎందుకు? ఎప్పుడు? - mlc elections updates

ఫిబ్రవరిలో ఎన్నికలు జరగని వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్​ ప్రకటించింది.

ward member elections
వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు

By

Published : Mar 3, 2021, 10:19 AM IST

Updated : Mar 3, 2021, 11:06 AM IST

గ్రామ పంచాయతీ ఎన్నికలు గత నెలలో పూర్తయ్యాయి. అయితే.. ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకుండా ఎన్నికలు జరగని వార్డులు కొన్ని మిగిలిపోయాయి. అలాంటి చోట్ల.. వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 4న నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల స్వీకరణకు మార్చి 6 చివరి తేదీగా ప్రకటించింది.

ఈ నెల 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 8వ తేదీన నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు, 9వ తేదీన అప్పీళ్ల పరిష్కారం, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 10 చివరి తేదీగా షెడ్యూల్‌లో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు అవసరమైతే మార్చి 15న ఎన్నికలు నిర్వహించి, అనంతరం కౌంటింగ్‌ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గుంటూరులో ఎన్నికలు జరగనున్న వార్డు సభ్యుల స్థానాలు

మండలం గ్రామం వార్డు
భట్టిప్రోలు కన్నెగంటివారిపాలెం 6వ వార్డు
బొల్లాపల్లి లాలిపురం 2వ వార్డు
రొంపిచర్ల అన్నవరప్పాడు 5వ వార్డు
రొంపిచర్ల వడ్లమూడివారిపాలెం 9వ వార్డు
వినుకొండ చీకటిగలవారిపాలెం 3వ వార్డు
పెదనందిపాడు గోగులమూడి 5వ వార్డు
ప్రత్తిపాడు కోయవారిపాలెం 10వ వార్డు


పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి

పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న గుంటూరు, కృష్ణా జిల్లాల ఎన్నికల అధికారి కేవీ రమణ

ఈ నెల 14న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను.. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎన్నికల అధికారి కేవీ రమణ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో వసతుల పట్ల స్థానిక తహశీల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిశుభ్రత ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారాలు చేయకుండా... కరపత్రాలు అతికించకుండా చూడాలన్నారు.

ఇదీ చదవండి:

హోరెత్తిన పురపోరు.. ప్రచార బరిలో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు

Last Updated : Mar 3, 2021, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details