ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శ ఆలస్యం.. అభిమానుల వీరంగం.. థియేటర్‌ అద్దాలు ద్వంసం - Mass Maharaja Ravi Teja fans

Megastar Chiranjeevi Fans: మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజ్‌ రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Waltair Veerayya fans
Waltair Veerayya fans

By

Published : Jan 13, 2023, 12:26 PM IST

Megastar Chiranjeevi Fans: మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజ్‌ రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. సినిమా హాలు అద్దాలు పగలగొట్టడంతో పాటు యాజమాన్యానికి విరుద్ధంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు చిరంజీవి నూతన సినిమా అయినా వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా బెన్ఫిట్ షో ప్రదర్శించేందుకు అధిక స్థాయిలో అధిక రేటులో టికెట్లు విక్రయించారు. అయితే సాంకేతిక లోపం కారణంగా చిత్రం ప్రదర్శించకపోవడంతో చిరంజీవి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ అద్దాలు పగలకొట్టడంతో పాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను అక్కడ నుంచి పంపించేశారు.

వాల్తేరు వీరయ్య అభిమానుల వీరంగం.. థియేటర్‌ అద్దాలు ద్వంసం

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details