ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని వీఆర్వోలు ధర్నా - vros protest at guntur district news update

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వీఆర్‌వోల సంఘం ధర్నా చేపట్టింది. ఎంతో కాలంగా వీఆర్‌వోగా పని చేస్తున్న తమకు సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

VRO union protest for their demands
సమస్యలు పరిష్కరించాలని వీఆర్వోలు ధర్నా

By

Published : Oct 19, 2020, 4:08 PM IST

వీఆర్‌వోల సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌ వద్ద వీఆర్వోలు ధర్నా చేపట్టారు. పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ సమస్యలపై.. ఉన్నతాధికారులు స్పందించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్‌ కోరారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఆధ్వర్యంలో సచివాలయంలో పనిచేస్తున్న తమకు వేతనాలను కూడా సచివాలయాలకు అనుబంధం చేయటం సరికాదని, తహశీల్దార్‌ కార్యాలయం నుంచే వేతనాలను అందించాలన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details