VRAs Dharna: తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సేవకులు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విజయవాడలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని.. తమకు సంఘీభావం ప్రకటించారన్నారు. అధికారంలోకి రాగానే వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చారని గ్రామ సేవకులు అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీఏను గత ఏడాది నుంచి రికవరీ చేస్తున్నారని వాపోయారు. వీఆర్ఏలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు.
మంగళగిరిలో వీఆర్ఏల ఆందోళన.. పలువురు అరెస్ట్
VRAs Dharna: తమ సమస్యలన్నీ తీరుస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో వారంతా ఎంతో సంతోషించారు. వైకాపా అధికారంలోకి రాగానే తమ సమస్యలు తీరుతాయని భావించారు. కానీ మూడేళ్లైనా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వారి పరిస్థితి ఉంది. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీఆర్ఏల ధర్నా
Last Updated : Sep 20, 2022, 5:29 PM IST