గుంటూరు నగరపాలక సంస్థలోని 33వ డివిజన్లో కొంతమంది ఓటర్లను 40వ డివిజన్లోకి మార్చారు. కుటుంబ సభ్యుల్లోని వారికి సొంత డివిజన్లో, మరికొందరికి వేరే డివిజన్లో ఓట్లు రావటంతో గందరగోళం నెలకొంది. ఆన్లైన్లో తమ ఓటు ఉన్నట్లు చూపించటంతో ఓటు వేద్దామని వచ్చిన కొందరికి నిరాశే ఎదురైంది. తమకు సంబంధం లేని వేరే వార్డుల్లో ఓట్లు ఉండటంతో అంత దూరం వెళ్లి ఓటు వేయాలా? అని పలువురు అడుగుతున్నారు. తెదేపాకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు ఓటు కూడా 40వ వార్డుకు మార్చారు. తమ ఇంట్లో కొందరివి అక్కడ, కొందరివి ఇక్కడ ఉండటం అధికార పార్టీ నేతల పనేనని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి మేలు చేసేందుకే.. వైకాపాకు అనుకూలంగా లేని వార్డుల్లోని ఓటర్లను వేరే డివిజన్లకు మార్చినట్లు చెబుతున్నారు.
ఓటర్ల గందరగోళం.. ఒకే ఇంట్లోని కొందరివి ఇక్కడ.. మరికొందరివి అక్కడ - గుంటూరు నగరపాలక సంస్థలో ఓటర్ల జాబితాలో తప్పులు న్యూస్
గుంటూరు నగరపాలక సంస్థలో ఓటర్ల జాబితాలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారు. తాము నివాసం ఉంటున్న డివిజన్లో కాకుండా వేరే డివిజన్లకు ఓట్లు మార్చినట్లు ఓటర్లు ఆరోపిస్తున్నారు.
![ఓటర్ల గందరగోళం.. ఒకే ఇంట్లోని కొందరివి ఇక్కడ.. మరికొందరివి అక్కడ voters wards changed in gunturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10945114-1082-10945114-1615355377568.jpg)
voters wards changed in gunturu