ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రచారంలో వాలంటీర్లు.. ఓటర్ల స్లిప్పులపై ప్రభుత్వ పథకాలు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తేలప్రోలులో వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఓటరుకు అందించే స్లిప్పులపై ప్రభుత్వ పథకాలను తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల తీరుపై ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అధికారులకు ఫిర్యాదు చేశారు.

volunteers unique way of campaign in tenali at guntur district
వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం.. ప్రత్యర్థుల అభ్యంతరం

By

Published : Feb 8, 2021, 2:16 PM IST

Updated : Feb 8, 2021, 4:36 PM IST

వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం.. ప్రత్యర్థుల అభ్యంతరం

గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో ఓటర్ స్లిప్పులపై సంబంధిత ఓటరుకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను రాసి పంచుతున్నారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఈ స్లిప్పులను అందిస్తున్నారు.

వైకాపా మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేయకపోతే పథకాలకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. దీనిపై పోటీలో ఉన్న ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Last Updated : Feb 8, 2021, 4:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details