ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​కు లేఖ రాసి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ తనను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం జగన్​కు లేఖ రాసి ఓ దివ్యాంగురాలైన వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

volunteer suiciden attempt
volunteer suiciden attempt

By

Published : Nov 25, 2020, 5:44 AM IST

Updated : Nov 25, 2020, 6:46 AM IST

సీఎం జగన్​కు లేఖ రాసి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు లేఖ రాసి దివ్యాంగురాలైన వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్సై రఘపతిరావు, బాధితురాలు రాసిన లేఖలో పేర్కొన్న అంశాల మేరకు... ఐదో వార్డు సచివాలయం వాలంటీరు మహంకాళి అంకేశ్వరి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించించారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్​కు తరలించారు.

నా ఆత్మహత్యకు అతనే కారణం

వాలంటీరు వద్ద లభ్యమైన లేఖలో తాను ఆరో వార్డు రేషన్ డీలరు వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ అనర్హురాలికి చేయూత పథకం లబ్ధి అందలేదనే కారణాన్ని చూపించి ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొంది. తన ఆత్మహత్యకు రేషన్ డీలర్ కారణమని ఆరోపిస్తూ వాలంటీర్లూ క్షమించండి... అమ్మా క్షమించు అని ఆమె లేఖలో రాశారు.

ఉద్యోగం నుంచి తొలగించాలని కమిషనర్​కు లేఖ

అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందజేయట్లేదని... సకాలంలో తమకు పథకాలు అందేలా చూడట్లేదని ఆరో వార్డుకు చెందిన ప్రజలు వాలంటీర్ అంకేశ్వరిపై స్పందనలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్​కు లేఖ పంపారు. తనను విధుల నుంచి తొలగిస్తారని భావించి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు భావిస్తున్నామని ఎస్సై చెప్పారు.

ఇదీ చదవండి

ఆస్తి పన్ను చట్టానికి సవరణ...రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను

Last Updated : Nov 25, 2020, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details