ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్ ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా? - volunteer sucide in cherukupalli sucide news

వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగింది. ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

guntur district
వాలంటీర్ ఆత్మహత్యా.. కారణం!

By

Published : Jun 8, 2020, 2:59 PM IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వాలంటీర్​గా పని చేసిన గడ్డం సురేంద్ర (28) కు.. ఏడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య కలహాలు రాగా.. విడిగా ఉంటున్నారు.

ఈ రోజు తెల్లవారుజామున సురేంద్ర ఇంటిలోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details