గుంటూరు జిల్లా నకరికల్లు నాల్గో వార్డుకు చెందిన ఉప్పలపాటి ప్రతిమ అనే మహిళ.. ప్రభుత్వం అందిస్తున్న ఇళ్లస్థలానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.5వేలు ఇవ్వాలంటూ స్థానిక వార్డు వాలంటీర్ బెదిరిస్తున్నాడని వాపోయింది. లంచం అడుగుతున్న వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీడీఓకు ఆమె ఫిర్యాదు చేసింది.
లంచం కోసం వాలంటీర్ వేధింపులు - గుంటూరు జిల్లా నేటి వార్తలు
గుంటూరు జిల్లా నకరికల్లులో లంచం ఇస్తేనే ఇంటిస్థలం అనుమతి ఇప్పిస్తానని.. తనను రెండు నెలలుగా వాలంటీర్ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్థానిక అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది.

లంచం కోసం వాలంటీర్ వేధింపులు