ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు - వాలంటీర్ మృతి వార్తలు

డీఈడీ పరీక్షలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళా వాలంటీర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. షేక్ రూబియా బేగం పరీక్ష రాసి ద్విచక్రవాహనంపై తన భర్తతో కలిసి తిరుగు పయనమైంది. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో రూబియా తీవ్రంగా గాయపడటంతో.. జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ.. రూబియా నేడు మృతిచెందినట్లు రెండోపట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు.

volunteer death in road accident occured at guntur district
పరీక్షకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

By

Published : Dec 18, 2020, 11:00 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రూబియా బేగం.. పట్టణంలోని 20వ వార్డు వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. అయితే డీఈడీ ఆఖరి సంవరత్సరం పరీక్షల నిమిత్తం.. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలకు తన భర్త ఫణిదరపు అశోక్ కుమార్​తో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. చిలకలూరిపేట రోడ్డులోని ఓవర్ బ్రిడ్జ్ పైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో రూబియా బేగం తీవ్రంగా గాయపడటంతో.. జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ రూబియా బేగం ఇవాళ మృతి చెందినట్లు.. రెండోపట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details