తల్లి కొడుకులపై వాలంటీర్ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. పట్టణంలోని శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన ఉయ్యాల శివకృష్ణ, అతని తల్లి అంజమ్మలపై అదే కాలనీకి చెందిన మల్లికార్జున అనే వాలంటీర్ దాడి చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
రేషన్ బియ్యం తెచ్చుకున్నందుకు మాపై వాలంటీర్, అతని బంధువులు దాడి చేశారని బాధితులు తెలిపారు. కాలనీలో తాను చెప్పింది వినాలంటూ.. ఇద్దరిని కొట్టాడని బాధితుడు వాపోయాడు. దాడిపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ..ఇప్పటివరకు వారు స్పందించలేదని తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. తీవ్ర గాయాలైన ఉయ్యాల శివకృష్ణ, అతని తల్లి అంజమ్మలు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.