ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సునీల్ యాదవ్​కు బెయిల్ ఇవ్వొద్దు: వివేకా సతీమణి సౌభాగ్యమ్మ - sunil yadav bail petition

Viveka's wife Sowbhagya filed A petition Against Sunil Yadav : వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇంప్లీడ్​ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

YS
YS

By

Published : Feb 16, 2023, 5:51 PM IST

Updated : Feb 16, 2023, 7:56 PM IST

Viveka's wife Shobha filed A Petition Against Sunil Yadav : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్య గావించబడ్డారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ వేసిన బెయిల్ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ కేసులోని నిందితుల బెయిల్ పిటిషన్లు సైతం తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రెండు రోజుల క్రితం సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. వీటిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

పిటిషన్​లో సౌభాగ్యమ్మ:వైఎస్ వివేకా హత్య తర్వాత నిందితుల వల్ల ఎంతో మానసిక క్షోభ అనుభవించామని వైఎస్ సౌభాగ్యమ్మ అన్నారు. ఇంప్లీడ్ పిటిషన్​లో సౌభాగ్యమ్మ పలు అంశాలను పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం బాధితులు సైతం ఇంప్లీడ్ కావొచ్చని సౌభాగ్యమ్మ పిటిషన్​లో పేర్కొన్నారు. 2019, మార్చి 15 తెల్లవారుజాము వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యాడని.. పులివెందుల పీఎస్​లో కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు.

దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశామని.. 2020 మార్చి 11న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆమె పిటిషన్​లో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు నేరాభియోగపత్రం, అనుబంధ నేరాభియోగపత్రం దాఖలు చేశారని ఆమె తెలిపారు. సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని.. అందులో ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నాడని తెలిపారు. సునీల్ యాదవ్, ఇతర నిందితులు దర్యాప్తు, విచారణను ప్రభావితం చేస్తున్నారని.. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని తమ కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని.. 2022 నవంబర్ 29న విచారణను నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వచ్చిందని.. ఈ మేరకు గత నెల కోర్టు విచారణకు స్వీకరించిందని ఆమె తెలిపారు. సునీల్ యాదవ్ వివేకా హత్య కేసులో కీలక పాత్ర పోషించాడని.. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడని... న్యాయం కోసం వేసిన ఇంప్లీడ్ పిటిషన్​ను అనుమతించాలని హైకోర్టును సౌభాగ్యమ్మ కోరారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్, దేవిరెడ్డి శివశంకర్​లు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారిస్తోంది. కడప జైళ్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను గత వారం హైదరాబాద్ తీసుకొచ్చి సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులను 14రోజుల రిమాండ్​కు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్​పై బయట ఉన్నాడు. మరో నిందితుడు దస్తగిరి అప్రూవర్​గా మారాడు.

నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు సైతం తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రెండు రోజుల క్రితం సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details