గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్గా వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న జేసీ దినేశ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో స్థానిక ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ వివేక్ చెప్పారు.
వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు జేసీలు దినేశ్ కుమార్, ప్రశాంతి, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.