సీఎం నివాసం సమీపంలో విశాఖ వాసుల ధర్నా - ap latest news
10:39 October 05
దివ్యాంగులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన షాపులు రద్దుచేశారని ఆరోపణ
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో విశాఖ వాసుల ధర్నా చేస్తున్నారు. తమ దుకాణాలు రద్దు చేశారని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాలోని 13 రైతు బజార్లలో... దివ్యాంగులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన షాపులు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కాలంగా అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకలేదని వాపోతున్నారు. వెఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేటాయించిన దుకాణాలను... కుమారుడి హయాంలో రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. నిరసనకారులు తాడేపల్లి వరకు బస్సులో వచ్చారు.
ఇదీ చూడండి:FORMER MINISTER SOMIREDDY: 'లఖింపుర్ ఖేరి ఘటన దురదృష్ణకరం.. ఇప్పటికైనా కొత్త చట్టాలు తీసుకురండి'