ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సామాజిక సమానత్వం కోసం శ్రమించిన నేత జగ్జీవన్ రామ్' - వినుకొండ తెదేపా నేత తాజా వార్తలు

గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా నేతలు.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.

vinukonda tdp mla given condolence to babu jagjeevan ram death anniversary
వినుకొండ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

By

Published : Jul 6, 2020, 7:50 PM IST

మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా నేతలు నివాళి అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని కొనియాడారు. యువత అంతా ఆయన బాటలో నడవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details