ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా ఐదు వార్డుల్లో గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా' - vinukonda latest news

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో పార్టీల పొత్తులపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఐదు వార్డుల్లో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేకపోతే మాజీ ఎమ్మెల్యే జీవీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

vinukonda mla bolla brahma naidu fire on tdp leader gv
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

By

Published : Mar 7, 2021, 6:00 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక ఎన్నికల్లో తెదేపా ఐదు వార్డుల్లో గెలిస్తే... ఎమ్మెల్యే పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని, లేకపోతే మాజీ ఎమ్మెల్యే జీవీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినుకొండలో తెదేపా, భాజపా, సీపీఐ, జనసేనల పొత్తులు వింత పోకడలకు దారి తీస్తున్నాయని బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని మసీదు మాన్యం భూములను సీపీఐ నేతలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. వీరికి తెదేపా నేతలు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించి, అర్హులైన ముస్లిం పేదలకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details