"రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతూ... పంచాయతీలో గెలుపే లక్ష్యంగా నిర్బంధంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోంది" అని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నరసరావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాచర్ల వెళ్లేందుకు సోమవారం సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను వినుకొండలోని తన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నిర్బంధాలకు పాల్పడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
దుర్గి మండలం ఓబులేసు పల్లి పంచాయతీ సర్పంచ్ తెదేపా అభ్యర్థిగా సీతమ్మ నామినేషన్ వేస్తుండగా, అధికార పార్టీ ఓటమి భయంతో ఆమె భర్త వెంకటేశ్వర్లును అక్రమంగా అరెస్టు చేసి దుర్గి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అత్యంత నీఛమైన చర్య అన్నారు. తెదేపా కార్యకర్తలో మనోధైర్యాన్ని నింపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం సబబు కాదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌ను కోర్టు రద్దు చేసి అనుమతిస్తే... తెదేపా నాయకులు, కార్యకర్తలపై కొంతమంది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.