ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ATTACK: కూల్చివేతలు అడ్డుకున్నందుకేనా..? - guntur bjp leader attack

గుంటూరు జిల్లా వినుకొండ భాజపా అధ్యక్షుడు మేడం రమేశ్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సురేశ్ మహల్ రోడ్​లో శివాలయం కూల్చివేత విషయంలో కమిషనర్​పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వల్లే.. అతను తనపై దాడి చేయించాడని రమేశ్ ఆరోపించారు.

భాజపా నేతపై ఆంగతకుల దాడి.. మున్సిపల్ కమిషనర్​పై ఫిర్యాదు
భాజపా నేతపై ఆంగతకుల దాడి.. మున్సిపల్ కమిషనర్​పై ఫిర్యాదు

By

Published : Aug 13, 2021, 11:24 AM IST

Updated : Aug 13, 2021, 12:47 PM IST

భారతీయ జనతా పార్టీ వినుకొండ అధ్యక్షుడు మేడం రమేశ్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టణంలోని ఏనుగు పాలెం రోడ్డులో ఇవాళ దాడి జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు మొహనికి మాస్కులు ధరించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారని రమేష్ వాపోయారు.

సురేష్ మహల్ రోడ్​లోని శివాలయం కూల్చివేత విషయంలో కమిషనర్​ శ్రీనివాసరావుపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన తనపై దాడి చేయించాడని బాధితుడు రమేష్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

భాజపా నేతపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

తెదేపా, జనసేన నేతల పరామర్శ..

రమేశ్​ను తెదేపా, జనసేన నాయకులు పరామర్శించారు. వినుకొండలో గతంలోనూ విలేకర్లపై దాడులు జరిగాయని .. వైకాపా ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని తెదేపా నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, జనసేన నాయకులు విమర్శించారు.

ఇదీ చదవండి:FARMERS AGITATION: భూమి సర్వే పనులను అడ్డుకున్న రైతులు

Last Updated : Aug 13, 2021, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details