Vinod Kumar Fires On Sharmila: వైఎస్ షర్మిల బీజేపీ వదిలిన బాణంమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడంలో అర్ధం లేదని విమర్శించారు. ఆమెకు ఇక్కడ అభివృద్ధి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని దుయ్యబట్టారు. షర్మిల ఏపీలో పాదయాత్ర చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని సూచించారు. ఈ ప్రాంతంలో ఒక్క నిమిషమైనా కరెంట్ పోతోందా .. మీ అన్న పాలించే ప్రాంతంలో అసలు కరెంట్ ఉందా అని అన్నారు. షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"వైఎస్ఆర్ తెలంగాణ వ్యతిరేకి. మీ పాదయాత్ర కేవలం తెలంగాణ ప్రజలను, సమాజాన్ని మభ్యపెట్టి.. తెలంగాణ ఉద్యమపార్టీ, ఉద్యమ నేత కేసీఆర్ను కించపరస్తూ ఉపనాస్యాలు ఇస్తున్నారు. కేంద్రంలో భాజపా వదిలిపెట్టినా ఒక కార్యకర్త షర్మిల. అమిత్ షా మాట్లాడిన తర్వాత షర్మిల పాదయాత్రలో మాట్లాడిన వ్యాఖ్యలన్ని వింటున్నాము. శాసనసభ్యులను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా షర్మిల మాట్లాడుతున్నారు." - వినోద్ కుమార్ , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు