VILLAGERS PROTEST: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో అధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. రహదారి విస్తరణలో భాగంగా నిడమర్రు - కంతేరులో ఆక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 12ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయమంటే.. ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీశారు. ఆక్రమణల తొలగింపులో అందర్నీ ఒకేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన వారి దుకాణాలు ఖాళీ చేయించకుండా.. ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేని షాపులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
VILLAGERS PROTEST: 'ఆక్రమణల తొలగింపుల్లో అందర్నీ ఒకేలా చూడాలి' - గుంటూరు జిల్లా తాజా వార్తలు
VILLAGERS PROTEST: అధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. రహదారి విస్తరణలో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 12ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయమంటే.. ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీశారు.
'ఆక్రమణల్లో అందర్నీ ఒకేలా చూడాలి'- నిడమర్రు గ్రామస్తులు