ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా గ్రామంలో అది వద్దు.. తీసేయండి' - గుండిమెడలో గ్రామస్థుల ధర్నా వార్తలు

తమ గ్రామంలో క్వారంటైన్ కేంద్రాన్ని తీసేయాలంటూ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామస్థులు ఆందోళన చేశారు. కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని... కరోనా అనుమానితులు వినియోగించిన నీరు వీధుల్లోకి వస్తోందన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.

villagers protest against quarantine centre in gundimeda guntur district
గుండిమెడ గ్రామస్థుల ధర్నా

By

Published : Jun 8, 2020, 3:28 PM IST

కరోనా అనుమానితుల కోసం.. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తీసేయాలంటూ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామస్థులు ఆందోళన చేశారు. వీరి నిరసనకు తెలుగుదేశం, భాజపా నేతలు మద్దతు తెలిపారు. గ్రామానికి ఆనుకొనే క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారని.. ఈ విషయంపై కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా.. ఆదివారం సాయంత్రం 20 మంది కరోనా అనుమానితులను పోలీసులు తీసుకొస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని... కరోనా అనుమానితులు వినియోగించిన నీరు వీధుల్లోకి వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. ఈ చర్యను తెదేపా, భాజపా నేతలు ఖండించారు. ఇప్పటికైనా క్వారంటైన్ కేంద్రాన్ని వేరేచోటుకు తరలించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details