గుంటూరు జిల్లా నగరం మండలం కొలగానివారిపాలెం గ్రామం మొత్తం హిందువులే. ఇటీవల కొంతమంది అన్యమత ప్రచారకులు ఆ ఊరిలోకి వచ్చి 'మతం మార్చుకోండి... అలా చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి'అంటూ... ప్రలోభాలకు గురిచేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. తమ స్వలాభం కోసం గ్రామస్థులను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇకపై అలాంటివి జరగకుండా... ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామనీ... 'మత ప్రచారం చేయొద్దని' గ్రామ సరిహద్దులో బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు వివరించారు. మతం మార్చుకుంటే కన్నతల్లిని మార్చుకున్నట్లేనని.. ఎవరూ ప్రలోభాలకు గురై... మతం మారొద్దని గ్రామపెద్దలు సూచించారు.
అన్యమత ప్రచారకులకు హెచ్చరిక..! - kolaganivaripalem villagers objected to enter pagans
తమ గ్రామంలో అన్యమత ప్రచారం చెయ్యడానికి వీల్లేదంటూ... ఆ ఊరంతా ఒకే మాటపై నిలబడింది. అలా చేస్తే చర్యలు తీసుకుంటామంటూ... గ్రామంలోకి వెళ్లే దారిలో బ్యానర్ ఏర్పాటు చేశారు గ్రామస్థులు.
కొలగానివారిపాలెం గ్రామం