గుంటూరు జిల్లా ముత్తాయిపాలెంలోని ఇసుక రీచ్‌ల వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రహదారులు ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. లారీల వలన వెలువడే దుమ్ము ధూళితో తమ పంట పొలాలకు నష్టం జరుగుతుందని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. గుత్తేదారులతో చరవాణిలో మాట్లాడి నిబంధనలు పాటించాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముత్తాయిపాలెంలో ఇసుక రీచ్‌ల వద్ద గ్రామస్థుల ఆందోళన - ముత్తాయిపాలెంలో గ్రామస్థుల నిరసన
గుంటూరు జిల్లా ముత్తాయిపాలెంలోని ఇసుక రీచ్‌ల వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లలో గుత్తేదారులు నిబంధనలు పాటించడం లేదని వారు వాపోయారు.
ముత్తాయిపాలెంలోని ఇసుక రీచ్‌ల వద్ద గ్రామస్థుల ఆందోళన