ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం - Village volunteer raped a girl news

నమ్మకంగా ప్రజలకు సేవలందించాల్సిన గ్రామ వాలంటీరు ఓ బాలికకు మాయమాటలు చెప్పి.. ఆమెను లోబరుచుకున్నాడు. పలు మార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

girl raped by volunteer
బాలికపై అత్యాచారం

By

Published : Apr 3, 2021, 9:54 AM IST

ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. ఓ బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చుండూరు మండలం మున్నంగివారిపాలెంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామ వాలంటీరు ఉమామహేశ్వరరావు అలియాస్‌ పవన్‌... స్థానికురాలైన బాలిక(14)ను ప్రేమిస్తున్నానని నమ్మించి, పలుమార్లు అత్యాచారం చేశాడు.

అతని మోసాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. నిందితుడు వాలంటీరుగా పనిచేస్తూనే, మండలానికి చెందిన ఓ అధికారి కారు డ్రైవర్‌గానూ సేవలందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details