ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని - రాజకీయ వర్గాల్లో చర్చ - MP Kesineni Nani

Vijayawada MP Kesineni Nani met CM Jagan: విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్​తో భేటీ అయ్యారు. నానితో పాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసినేని నాని సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

kesineni_nani_met_jagan
kesineni_nani_met_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 6:18 PM IST

Vijayawada MP Kesineni Nani met CM Jagan:సీఎం జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని సీఎం జగన్​తో భేటీ అయ్యారు. నానితో పాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు. టీడీపీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని ఇప్పటికే సోషల్​మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో కేసినేని నాని సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

విజయవాడపై కక్షతో జగన్ ప్రైమ్ ఏరియాను శ్మశానంలా మార్చారు: ఎంపీ కేశినేని

Keshineni Nani resigned TDP:ఇటీవలతెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని సోషల్​మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్​పై ఎంపీ కేశినేని నానికి ఇవ్వలేదు. ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించిందని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా టీడీపీ నేతలు తనతో చెప్పినట్లు కేశినేని నాని పేర్కొన్నారు. జనవరి 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్​ఛార్జ్​గా నియమించారని సభ విషయంలోనూ తనను కలగ చేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా నేతలు చెప్పినట్లు నాని తెలిపారు.

ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను అని కేశినేని నాని పేర్కొన్నారు.

తిరువూరులో కేశినేని నాని Vs చిన్నీ - ఇరువర్గాల బాహాబాహీ

Kesineni Swetha Resigned for VMC Corporator: విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సైతం టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను మేయర్‌కు అందజేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా ఆమోదం తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు రాజీనామా ఆమోదించాలని మేయర్​ని శ్వేత కోరారు. ఒక సిట్టింగ్‌ ఎంపీ అయిన కేశినేని నానికి విజయవాడలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చిందని తెలిపారు. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైనది పేర్కొన్నారు. తాము ఎవరినీ తప్పు పట్టడం లేదని, పార్టీ కోసం చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నారు. తన తండ్రికి జరిగిన అవమానం అందరికీ తెలిసిందేనని, గౌరవం లేని చోట తాము పని చేయలేమని చెప్పారు. పార్టీని నష్టపరచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ ఇవ్వకపోయినా అధినేత ఆదేశాలు తప్పకుండా పాటిస్తా: టీడీపీ ఎంపీ కేశినేని నాని

ABOUT THE AUTHOR

...view details