గుంటూరు జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు - dasara celebrations in guntur district news update
గుంటూరు జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించి, కొత్త వాహనాలకు పూజలు నిర్వహించారు.
గుంటూరులో ఘనంగా విజయదశమి వేడుకలు
విజయదశమి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలు ఆలయాల్లో దుర్గాదేవి, లలితా పరమేశ్వరి, భద్రకాళి రూపాల్లో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. దుర్గ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. తమ కొత్త వాహనాలను తెచ్చి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.