ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 19, 2021, 9:44 PM IST

ETV Bharat / state

నకిలీ పురుగు మందుల కేంద్రంపై అధికారుల దాడి

గుంటూరు జిల్లాలో నకిలీ పురుగుల మందుల తయారీ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. వారి వద్ద నుంచి 1500 నకిలీ పురుగుల మందుల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

vigilence raid
నకిలీ పురుగు మందుల కేంద్రంపై అధికారుల దాడి .. 1500 డబ్బాలు స్వాధీనం

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై విజిలెన్సు అధికారులు దాడి చేశారు. 1500 డబ్బాల నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్సు ఎస్పీ జాషువా నేతృత్వంలోని విజిలెన్సు అధికారుల బృందం... పక్కా సమాచారంతో నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి చెందిన మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసిన గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు.

అనధికారికంగా తయారు చేసి నిల్వ చేసిన సంజీవని, ఫైటర్, రైజ్, బాంబర్, లాలు స్టార్, టైగర్ అనే బ్రాండ్ల పేరుతో రిటైల్​గా వీటిని విక్రయిస్తున్నట్లు విజిలెన్సు ఎస్పీ జాషువా వెల్లడించారు. నకిలీ పురుగుమందుల తయారీకి వాడుతున్న ముడి పదార్థాలు, తయారీ పరికరాలను విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీదారుడిపై వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు విజిలెన్సు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:చేతబడి అనుమానంతో వ్యక్తి పై దాడి..

ABOUT THE AUTHOR

...view details