గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పెదనందిపాడు మండలం కోప్పర్రులో ఓ ఇంట్లో దాచిన రేషన్ బియ్యాన్ని సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ సత్యనారాయణ తెలిపారు. బియ్యం తరలిస్తున్న వారిని జేసీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు
గుంటూరు జిల్లాలో పలు చోట్ల అక్రమంగా ఉన్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత