గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్‌లోని రెండు రేషన్ దుకాణాల రికార్డుల్లో తప్పులను గుర్తించారు. అక్రమ నిల్వలు కలిగి ఉన్న డీలర్లు...నల్లబోతుల వెంకటేశ్వరరావు, బానావత్ మల్లేశ్వరరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఇద్దరు డీలర్ల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆరోపణపై భవాని శంకర్ అనే వ్యక్తితో పాటు..,అతని అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు.
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు...ఇద్దరు డీలర్లపై కేసులు
విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించి ఇద్దరు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లా అరండల్‌పేటలో జరిగింది. ఉండాల్సిన నిల్వల కన్నా అధిక రేషన్ నిల్వలను గుర్తించటంతో వారిపై కేసులు నమోదు చేశారు.
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు