గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం పట్టుబడినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలో 20 టన్నులు, ఆటోలో 2 టన్నులమేర అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్ల చెప్పారు.
గుంటూరు జిల్లా గణపవరం నుంచి తెలంగాణలోకి బియ్యాన్ని పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు వాహనాలను సీజ్ చేసి… డ్రైవర్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.