ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్ గృహాల్లో అక్రమాలు: ఆళ్ల రామకృష్ణా రెడ్డి - Alala Ramakrishna Reddy

ఎన్టీఆర్ పట్టణ గృహ పథకంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. ఈ పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు ఆయన తెలిపారు.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి

By

Published : Jul 31, 2019, 5:19 PM IST

ఆళ్ల రామకృష్ణా రెడ్డి

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎన్టీఆర్ పట్టణ గృహ పథకంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులతో ఆయన సమావేశమయ్యారు. 1728 లబ్ధిదారులకు గాను 2053 మందితో అప్పటి పురపాలక సంఘం ఛైర్మన్ డీడీలు కట్టించారని చెప్పారు. తెదేపా నాయకులు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకొని ఇళ్లు కేటాయించారని విమర్శించారు. అలాంటి వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details