గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 21న వినియోగదారునికి, పాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జరిగిన ఘర్షణలో.. యువకుడు మరణించాడు. అయితే ఇప్పటి వరకూ నిందితుల్ని అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ బాజి బంధువులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పాల దుకాణంలో పనిచేసే బాజీకీ, కోటేశ్వరరావు అనే వినియోగదారుని మధ్య.. రూ.50 కోసం వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కోటేశ్వరరావు తన స్నేహితులతో వచ్చి బాజిపై దాడి చేయగా అతను మరణించాడు.
ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని.. బాజీ బంధువులు ఆరోపించారు. ఘటన జరిగి తొమ్మిది రోజులైనా ఇంకా నిందితుల్ని అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు బాజీ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. చివరికి బాజీ కుటుంబీకులు, బంధువులు ఆందోళనను విరమించారు.