గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురం తండాలో అప్పు చెల్లించలేదని మహిళను ట్రాక్ట్రర్ తో గుద్ది చంపిన వైకాపా నేత శ్రీనివాసరెడ్డిని శిక్షించాలంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బంధువులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైద్యశాల ఎదుట బంధువుల ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకుని మృతదేహాన్ని వాహనంలో ఎక్కించి వారి గ్రామానికి పంపారు. జరిగిన ఘటనపై నిందితుడైన బోనముక్కల శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని గ్రామీణ సీఐ అచ్చయ్య తెలిపారు.
ట్రాక్టర్‌తో హత్య.. న్యాయం చేయాలని బంధువుల ఆందోళన - guntur dst ycp leader murder news
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురం తండాలో అప్పు చెల్లించనందుకు.. మహిళను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన వైకాపా నేత శ్రీనివాసరెడ్డిని శిక్షించాలంటూ నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. నిన్న మృతిచెందిన.... రమావత్ మంత్రుభాయ్ మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించారు.
victicm familes protest in guntur dst narsaraopeta about murder of ycp leader