ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొట్టకూటి కోసం పెంచుకుంటే... ప్రాణాలు మీదికి తెచ్చింది - పిడుగురాళ్లలో కొండముచ్చు దాడి వార్తలు

పొట్టకూటి కోసం పెంచుకుంటున్న కొండముచ్చు ప్రాణం పోయేంత పని చేసింది. అప్పటిదాకా ఆడుతూ సరదాగా ఉండి ఒక్కసారిగా యజమానిపై దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

vervet monkey attack
కొండముచ్చు దాడిలో వ్యక్తి కి తీవ్రగాయాలు

By

Published : Dec 30, 2020, 12:37 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో ఓ వ్యక్తిపై తాను పెంచుకుంటున్న కొండముచ్చు దాడి చేసింది. ఈ ఘటనలో అతని తలకి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటివరకు సరదాగా ఉన్న పెంపుడు జంతువు ఒక్కసారిగా వ్యక్తిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. గాయాలపాలైన వ్యక్తిని పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయమేమి లేదని వైద్యులు తెలిపారు.

కొండముచ్చు దాడిలో వ్యక్తి కి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details