ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్సా అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి.. 288 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపు - new apsa prseident

VENKATRAMI REDDY WON : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి రామకృష్ణపై 288 ఓట్ల తేడాతో గెలుపొందారు. సచివాలయంలో 1,225 ఓట్లు ఉండగా.. 1,162 ఓట్లు వెంకట్రామిరెడ్డికి పోలయ్యాయి.

APSA PRESIDENT VENKATRAMIREDDY
APSA PRESIDENT VENKATRAMIREDDY

By

Published : Dec 22, 2022, 7:20 AM IST

APSA PRESIDENT VENKATRAMIREDDY : ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం ఎన్నికల్లో వెంకటరామిరెడ్డి మళ్లీ విజయం సాధించారు. 280 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి రామకృష్ణపై గెలుపొందారు. సచివాలయంలో 1,225 ఓట్లు ఉండగా.. 1,162 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 9 మందిలో ప్రధాన కార్యదర్శిగా స్వతంత్ర అభ్యర్థి, జలవనరుల శాఖ ఏఎస్‌ శ్రీకృష్ణ విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ ప్యానల్‌కు చెందిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ పీఎస్‌ యరన్‌ యాదవ్‌ గెలుపొందారు.

మిగతా ఏడు స్థానాలను వెంకట్రామిరెడ్డి వర్గమే గెలుచుకుంది. ఉపాధ్యక్షురాలు (మహిళ)గా సాధారణ పరిపాలన శాఖ ఎస్‌వో సత్యసులోచన, అదనపు కార్యదర్శిగా జలవనరుల శాఖ సహాయ సెక్షన్‌ అధికారి (ఏఎస్వో) గోపీకృష్ణ, ట్రెజరర్‌గా వైద్య శాఖ ఏఎస్వో వెంకట్రావు, సంయుక్త కార్యదర్శి (క్రీడలు)గా రెవెన్యూ విభాగం ఏఎస్వో సాయికుమార్‌, సంయుక్త కార్యదర్శి (మహిళ)గా ఏఎస్వో రమాదేవి రెడ్డి, సంయుక్త కార్యదర్శి (ఆర్గనైజేషన్‌)గా సాధారణ పరిపాలన విభాగం ఏఎస్వో మనోహర్‌ ఎన్నికయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details