కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె వెంకటేశ్వరరావుకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్‌కు చివరిరోజు గుంటూరు కలెక్టరేట్లో వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని బోనబోయిన శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీని గురువులు ఆశీర్వదించాలని కోరారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావు నామినేషన్
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గాదె వెంకటేశ్వరరావు.. గుంటూరు కలెక్టరేట్లో నామినేషన్ సమర్పించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
TAGGED:
teachers mlc elections