గుంటూరు గ్రామీణ మండలంలో ఉన్న జిందాల్ కంపెనీకి... వెంగళాయపాలెం చెరువు నుంచి నీటిని కేటాయించడంపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే జిందాల్ ప్లాంట్‌కు ప్రభుత్వం వెంగళాయపాలెం నుంచి నీరు కేటాయించింది. అయితే తమ గ్రామానికి నీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతుంటే... ప్లాంట్‌కు కేటాయించడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నించారు.
పైపు లైను పనుల కోసం వెళ్లిన జిందాల్ సంస్థ ప్రతినిధులను అడ్డుకున్నారు. పైపు లైను పనులు నిలిపివేయాలంటూ చెరువు కట్టపై బైఠాయించి నిరసన తెలిపారు. జిందాల్ కంపెనీకి నీరు ఇవ్వమని... పనులను ఆపకపోతే నిరాహార దీక్షలు చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.