అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ....గుంటూరు జిల్లా వెలగపూడిలో రైతులు,మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.ప్రభుత్వ వైఖరి కారణంగా మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి నిరసన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'సీఎం సీటులో చంద్రబాబు కూర్చునుంటే..ఆయన్నే అడిగేవాళ్లం' - వెలగపూడిలో మహిళా రైతుల ధర్నా
రాజధాని విషయంలో సీఎం జగన్ వ్యాఖ్యల కారణంగా.....అమరావతి రైతులు, తాము రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో రైతులతోపాటు మహిళలూ రిలే దీక్షలు చేపట్టారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం సీటులో చంద్రబాబు కూర్చునుంటే..ఆయన్నే అడిగేవాళ్లమని మహిళలు అన్నారు.
velagapudi womens darna
.